Sunday, April 28, 2024

JanaSena-TDP Alliance – రాష్ట్రానికి ప‌ట్టిన‌ వైసిపి తెగులుని టిడిపి – జ‌న‌సేన వ్యాక్సిన్ తో తుద‌ముట్టిస్తాం ..ప‌వ‌న్ క‌ల్యాణ్

రాజమహేంద్రవరం: వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన – టీడీపీ పొత్తు చరిత్రాత్మకమన్నారు. వైకాపా నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైకాపా వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని గతంలోనే చెప్పానని, రాష్ట్ర అభివృద్ధే జనసేన పార్టీకి ముఖ్యమని పవన్‌ తెలిపారు. తెదేపా-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసిన అనంతరం లోకేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే టీడీపీ, జనసేన కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేస్తామని ప్రకటించారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది.. కానీ చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని బెయిల్ రాకుండా చేసిందని ఆరోపించారు.
ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు. రెండు పార్టీలు కలిసి క్షేత్ర స్థాయిలో పని చేసే అంశంపై చర్చించామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.అన్ని పార్టీల నేతలనూ జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆయన ఆరోపించారు.వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలబోనివ్వని తాను 2021లోనే ప్రకటించినట్టుగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరమని 2014లో టీడీపీకి మద్దతిచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.

రాష్ట్రంలో మధ్య నిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. రూ. 30 వేల కోట్లను మద్యంపై జగన్ సర్కార్ సంపాదిస్తుందని ఆయన ఆరోపించారు. దారుణాలు చేసిన వారికి కూడ బెయిల్ వస్తుందన్నారు. కానీ చంద్రబాబు అరెస్టై 40 రోజులు అవుతున్నా ఆయనకు ఇంకా బెయిల్ రాలేదన్నారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైలులో పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
” మద్యనిషేధం చేస్తామని చెప్పి వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోంది. ఈ రాష్ట్రానికి వైకాపా అనే తెగులు పట్టుకుంది. ఆ తెగులు పోవాలంటే.. తెదేపా – జనసేన వ్యాక్సిన్‌ అవసరం. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారు. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్‌ రాకుండా చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యాం. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే మేం కలిశాం. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాం. తెదేపా-జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం” అని పవన్‌ అన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement