Monday, April 29, 2024

కడపలో భీమ్లా నాయక్ సినిమాకు పోలీస్ అడ్డంకులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా నేడు విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పవన్ అభిమానుల కోలాహం కనిపిస్తోంది. అయితే, కడప నగరంలో భీమ్లా నాయక్ సినిమాకు పోలీస్ అడ్డంకులు సృష్టించారు. సినిమా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఆనందోత్సాహాలను అడ్డుకున్నారు. టికెట్ల కోసం రోడ్డుపై ఉంచిన బైక్ లకు గాలి తీశారు. పోలీసుల ప్రవర్తనతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును జనసేన నగర అధ్యక్షుడు మాలే శివ ఖండించారు.

కాగా, పవర్‌స్టార్ అభిమానులలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. భీమ్లా నాయక్ ఈరోజే భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. దీంతో పవర్‌స్టార్ అభిమానుల హంగామా మాములుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బ్యానర్లు, డప్పులు, దండలు.. ఇలా పవన్ అభిమానుల ఉత్సాహంతో హంగామా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement