Monday, April 29, 2024

Pattikonda – బూడిద కొండల్లో చిరుతలు – భయాందోళనలో రైతులు

.పత్తికొండ సెప్టెంబర్ 24 ( ప్రభ న్యూస్) పత్తికొండ నుండి ప్యాపిలి వెళ్లే ప్రధాన రహదారి లో బూడిదగుండ్లలో గత రెండు వారాలుగా రెండు చిరతలు కొండపై భాగంలో ఉంటున్నాయని కొంతమంది రైతులు తెలిపారు. వ్యవసాయ కూలీల వెనుక వెళ్లే పెంపుడు కుక్కలు పదికి పైగా కనిపించడం లేదని అంటున్నారు. విషయం తెలుసుకున్న పత్తికొండ గ్రామస్తులు బూడిది గుండ్ల కొండ ప్రాంతంలో నిఘా పెట్టి చూడగా రెండు కొండల మధ్య రెండు చిరుతలు కనిపించడంతో అక్కడికి వెళ్లిన రైతులు భయంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు చిరుతలు మనుషులను ఏమి చెయ్యవని కుక్కలను, మేకలను మాత్రమే వేటాడుతాయని చులకన భావంతో ఫారెస్ట్ అధికారులు మాటలు విని ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే భయంగా ఉందని ఆ ప్రాంతంలో 10 గంటల పైన వ్యవసాయ పనులకు వెళ్లాల్సి వస్తుందని గుంపులు గుంపులుగా ఉండి వ్యవసాయ పనులు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించి వేరే ప్రాంతాలలో వదిలేయాలని ఆ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు..

.

Advertisement

తాజా వార్తలు

Advertisement