Thursday, May 2, 2024

ఉస్మానియా స్టూడెంట్‌కి ఏపీ మంత్రివర్గంలో చోటు.. జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రిగా రజనీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థి ఏపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి అయ్యింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ హైదరాబాద్‌లో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్‌ లో డిగ్రీ పూర్తి చేశారు. మల్కాజిగిరిలోని సెయింట్‌ ఆన్స్‌ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన రజనీ… విడదల కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. భర్తతో కలిసి సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన రజనీ… మెరుగైన అవకాశాల కోసం అమెరికా బాట పట్టారు.

అక్కడ శాన్‌ఫ్రాన్సిస్కోలో సాఫ్ట్‌ వేర్‌ మల్టిd నేషనల్‌ కంపెనీ ప్రాసెస్‌ వీవర్‌ కంపెనీని స్థాపించారు. కొన్నాళ్లపాటు ఆ కంపెనీకి డైరెక్టర్‌గా, బోర్డు మెంబర్‌గా సేవలందించారు. అమెరికా నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన రజనీ… 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో వీఆర్‌ ఫౌండేషన్‌ను స్థాపించి, అనేక సే వాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 2018లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన రజనీకి ఇద్దరు పిల్లలు. నిత్యం ప్రజల్లో ఉండడం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండడం రజనీ ప్రత్యేకతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement