Friday, May 3, 2024

Ap | రేప‌టి నుండి ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం..

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్‌.ఎస్‌.సి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌, షెడ్యుల్‌ విడుదల చేసినట్లు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 27.07.2023 నుండి 31.08.2023 వరకు అభ్యాసకుల నుండి http://www.apopenschool.ap.gov.in/ వెబ్‌ సైట్‌ ద్వారా ఆ్లనన్‌ లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏ.పి.ఓ ఎస్‌.ఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ పై ఓరియంటేషన్‌ ప్రోగ్రాంను తప్పనిసరిగా నిర్వహించాలని, 31.07.2023 నుండి 05.08.2023 వరకు ప్రవేశాలకు సంబంధించి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో అధ్యయన కేంద్రాల నిర్వాహకులతో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement