Friday, May 17, 2024

బహుదాకు కొనసాగుతున్న వరద ఉదృతి..

మదనపల్లి , ప్రభ న్యూస్: మదనపల్లి మరియు నిమ్మనపల్లి మండలాల్లో కురుస్తున్న జోరు వర్షలతో బహుదా ప్రాజెక్టుకు వరద ఉదృతి కొనసాగుతోంది. దింతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి వదిలి వేయడం జరుగుతోంది. మదనపల్లి పట్టణం మధ్య బహుదా మరియు భుగ్గ కాలువలు జోరుగా ప్రవహిస్తున్నాయి. దింతో బహుదా పరివాహక లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లులోకి నీళ్లు చేరాయి. దీనికి తోడు గురువారం వర్షం కురుస్తూనే ఉండటం తో పాటు శుక్రవారం కూడ వర్షం పడుతుందనే హెచ్చరికలతో ఆందోళన నడుము కాలం గడుపుతున్నారు.

భారీ వర్షాలతో పూర్తిగా నిండిన బహుదా ప్రాజెక్టు నుండి 2500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతే మొత్తంలో ప్రాజెక్ట్ లోకి వరద ప్రవాహం వస్తోంది. వరద ప్రవాహంతో నిమ్మనపల్లి నుండి వాల్మీకి పురం, చింతపర్తి రాక పోకలు నిలచి పోయాయి. మదనపల్లి పట్టణంలో ఆర్ టి సి బస్టాండ్ వద్ద ప్రవాహం రెండవ రోజు కొనసాగుతుందటంతో పోలీసులు రాక పోకలు అడ్డుకొని బ్యారికేడ్లు, బందోబస్తూ ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement