Tuesday, November 12, 2024

AP: పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు..

ఆంద్రప్రదేశ్ లో ఇటీవల పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలకు సైతం మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు.కానీ ఇంతవరకు ఎవరూ స్పందించలేదు.

తాజాగా శనివారం పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోషేన్ రాజు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, రామచంద్రయ్యకు శాసన మండలి నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ తుది విచారణకు హాజరుకాకుంటే తాము తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టంగా వెల్లడించారు.

కాగా, పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement