Thursday, April 25, 2024

24న డిసెంబర్‌ నెల వృద్దుల, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్‌ ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement