Friday, April 26, 2024

బీజేపీ రోడ్‌మ్యాప్‌ ఫిక్స్‌.. యాత్రలతో జనంలోకి వెళ్లేలా కార్యాచరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీజేపీ ఎన్నికల రోడ్‌ మ్యాప్‌ను ఫిక్స్‌ చేసేసింది. 2023 ఎన్నికలే లక్ష్యంగా గులాబీ పార్టిని ఢీకొనేందుకు యాత్రల పేరుతో జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణను రూపొందించింది. ఎన్నికలే లక్ష్యంగా నిత్యం జనంలో ఉండేలా యత్రలను ఖరారు చేసింది. ఈనెలలో రెండు యాత్రలతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ యాత్ర, ఐదవ విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’లను బీజేపీ చేపట్టబోతోంది. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్ర ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 14వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లి నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు.

ప్రతి అసెంబ్లి నియోజకవర్గ వ్యాప్తంగా 200 బైకులతో 10 నుండి 15 రోజుల పాటు బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతి గ్రామంలో స్థానిక సమస్యలపై కార్నర్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు మంగళవారం శామీర్‌పేటలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ ప్రకటించింది. మొదక్‌, దుబ్బాక, ఆందోల్‌, జహీరాబాద్‌, గద్వాల్‌, నాగర్‌ కర్నూల్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్థన్నపేట, మహబూబాబాద్‌, ములుగు నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలను చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement