Monday, April 29, 2024

అది ఒమిక్రానేనా..? భయం గుప్పెట్లో షార్‌ ఉద్యోగులు..

శ్రీహరికోట, (ప్రభన్యూస్‌) : కరోనా థర్డ్‌ వేవ్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట షార్‌లో వైద్య విభాగంలో పనిచేసే ఇద్దరు వైద్యులతో పాటు 12మంది షార్‌ ఉద్యోగులకు కరోనా సోకడంతో మిగిలిన ఉద్యోగులు భయం గుప్పెట్లో ఉన్నారు. వీరికి ఒమిక్రాన్‌ సోకి ఉండవచ్చునన్న అనుమానాలు ఉండడంతో వారికి సంబంధించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు షార్‌ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే షార్‌లో ఒకేసారి 14మందికి కరోనా సోకడంతో సూళ్లూరుపేట పురప్రజలతో పాటు షార్‌ పరిసర ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనతో షార్‌ ఉద్యోగులు, కార్మికులు పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపాటుకు గురై క్షణక్షణ భయంతో వణుకుతున్నారు. అటు షార్‌ యాజమాన్యం కూడా అప్రమత్తమై అవసరమైనటువంటి చర్యలు చేపడుతూ షార్‌ ఉద్యోగుల్లో నెలకొని ఉన్న భయాందోళనను పోగొట్టే విధంగా చొరవ చూపుతున్నారు.

షార్‌లో పనిచేసే ఉద్యోగులంతా సూళ్లూరుపేటలోని డీఓఎస్‌ కాలనీ, కేఆర్‌పీ కాలనీలలో నివసిస్తుండడంతో వారితో సత్సంబంధాలు కలిగిన వారంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు గత 15 రోజులుగా కరోనా సోకిన వారు సూళ్లూరుపేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేసి ప్రజలు, వ్యాపారస్తులు, సహచర ఉద్యోగులతో తిరిగి ఉంటున్న నేపథ్యంలో వారంతా కూడా తమకేదైన కరోనా సోకింద అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా షార్‌లో రాకెట్‌ ప్రయోగాలు నిలిపివేసారు, గత రెండు మూడు నెలల నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా షార్‌ ఉద్యోగులను కలవరపాటుకు గురిచేసే విధంగా కరోనా విజృంభించడంతో ఉద్యోగులంతా భయాందోళన చెందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement