Sunday, April 28, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సహాయక కార్యక్రమాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేలా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం, తాగు నీరు, మందులు సహా ఇతర వస్తువుల్ని అందిస్తున్నారు. అందుకవసరమైన మేర సరుకుల్ని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తరలించి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సిబ్బంది సహకారంతో బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాల అమలుపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్రప్రసాద్‌ సమీక్షించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందించడమే తమ ధ్యేయమని, ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ సిద్దాంతమని వివరించారు.

గోదావరి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 8 వేల కుటు-ంబాలకు నిత్యావసర వస్తువులు, మందులు, పిల్లలకు పాలు అందించామన్నారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర సమయాల్లో ప్రజలకు అండగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఉంటు-ందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement