Saturday, April 27, 2024

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి.. టీడీపీ శ్రేణుల నిరసన

వింజమూరు 10 ( ప్రభ న్యూస్) : వింజమూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు నిరసన చేప‌ట్టారు. సోమవారం వింజమూరు మండల కన్వీనర్ వంగటి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక‌ పాత బస్టాండ్ నుండి సబ్ స్టేషన్ వరకు ర్యాలీగా తరలివచ్చి సబ్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సామాన్యుడు నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తోపాటు చల్లా వెంకటేశ్వర్లు, గురజాల వాసు నాయుడు, గూడ నర్సారెడ్డి, కోడూరు నాగిరెడ్డి, జయమ్మ, మునగంటి తిరుపతి ఆచారి, కొండపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి : టిడిపి మండల కన్వీనర్ మధుసూదన్ రావు
వరికుంటపాడు ఏప్రిల్ 10 ప్రభా న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను అమాంతంగా పెంచి రైతులను నట్టేట ముంచిందని టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు ధ్వజమెత్తారు మండల కేంద్రమైన వరికుంటపాడు లోని సబ్ స్టేషన్ ముందు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆదేశాల మేరకు సోమవారం సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ చార్జీల పెంపుపై ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో యూనిట్కు రూపాయి ఉన్న విద్యుత్ చార్జీలను ప్రస్తుత ముఖ్యమంత్రి నాలుగు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు పెంచి ప్రజలపై భారం మోపారని అలాగే వ్యవసాయానికి విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడం రైతులపై భారం పెంచడమేనని అటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు అలాగే మండలంలో విద్యుత్ సమస్య అధికంగా ఉందని గ్రామాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారని సర్వీసులు ఉన్నచోట కాంట్రాక్టర్లు లైన్లో లాగే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆ సమస్యను పరిష్కరించాలని ఏఈని కోరారు అనంతరం విద్యుత్ ఏఈ ఖుద్ హుద్ భాషకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ చండ్ర వెంకయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ పోకా మహేష్, రావెళ్ల గోపికృష్ణ పాలకొల్లు విజయ భాస్కర్ రెడ్డి, పోద మాధవరావు ,గుర్రం గోపి, ఆరికొండ వెంకటరత్నం, దేవినేని ప్రసాద్, నల్లగొర్ల వెంగళరావు, సుంకర రాధాకృష్ణ, మట్టే హరి నారాయణ, ఆరోన్,లాబాన్, కొండలరావు, రంగయ్య, యూనిట్ ఇంచార్జ్ లు, క్లస్టర్ ఇంచార్జీలు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement