Sunday, December 8, 2024

Nellore: రోడ్డు యాక్సిడెంట్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

కలిగిరి: కలిగిరి-కొండాపురం దారిలో ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్ మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఆదివారం జ‌రిగిన ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని 108 అంబులెన్స్‌లో కావలి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

కలిగిరి మండలం లక్ష్మీపురం నుంచి తెల్లపాడు వైపు ట్రాక్టర్ వస్తుండగా కొండాపురం వైపునుంచి మోటార్ సైకిల్ పై పోట్లూరి చెంచయ్య, కల్లూరు చెంచయ్య, పోట్లూరి అంకయ్య కలిగిరి మండలం పోలంపాడు ఎస్సీ కాలనీకి వస్తున్నారు.

కలిగిరి ససమీపంలో కోయ్యల మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ముగ్గురికి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కలిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement