Monday, May 6, 2024

రాజ్ నాథ్ తో రఘురామ భేటీ.. జగన్ పై ఫిర్యాదు?!

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. కాలికి గాయం కారణంగా నడవకూడదని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు సూచించిన నేపథ్యంలో రఘురామ వీల్ చెయిర్ లోనే రాజ్ నాథ్ సింగ్ నివాసానికి వెళ్లారు. రాజ్ నాథ్ తో కొద్దిసేపు సమావేశమయ్యారు. సీఐడీ కేసు నుంచి ఎయిమ్స్ లో చికిత్స వరకు ఇటీవల జరిగిన పరిణామాలను కేంద్రమంత్రికి క్లుప్తంగా వివరించారు. తనపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయనకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రఘురామ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చిక్సిత పొందిన సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామను కస్టడీలో ఏపీ పోలీసులు వేధించారన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్ల తగిలిన దెబ్బలు అంటూ రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారం సీఐడీ కోర్టు పరిధిని దాటి హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సుప్రీంకోర్టు బెయిల్ ఆదేశాలు ఇవ్వడంతో విడుదలైన ఆయన, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ వైద్యులు, కొన్నిరోజుల పాటు నడవరాదని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement