Monday, May 6, 2024

స్టీల్ ప్లాంట్ పై ‘జగన్’నాటకం: లోకేష్

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర అడుగులు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ సీఎం వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో తేలిపోయింది అంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు.

ఇప్పటికైనా జగన్నాటకాలు ఆపి ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నాలు చేయండి అంటూ లోకేష్ జగన్ కు హితవు పలికారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయటానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర హీనులుగా నిలిచిపోతారు అంటూ జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో విశాఖ ఉక్కు పరిరక్షణకోసం, ఏపీ ప్రయోజనాల పరిరక్షణ కోసం మీ ఎంపీలతో పోరాటం చేయించాలని కూడా కోరారు. మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కి పోరాడాల‌ని ఆదేశాలివ్వండి అని లోకేష్ సూచించారు.

ఇది కూడా చదవండి: నెలకు రూ.5 లక్షల సంపాదిస్తున్న గిరిజన కూలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement