Sunday, April 28, 2024

పరీక్షల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది: లోకేష్

ఏపీలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం టిడిపి నాయకుడు నారా లోకేష్ విమర్శించారు. పరీక్షలను నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రమాదకర పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం మొండిగా పరీక్షలను నిర్వహించాలనుకుంటోందని దుయ్యబట్టారు. అనేక రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేస్తుంటే… ఏపీలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వంలో మార్పు రాకపోతే కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమవుతుందని చెప్పారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కరోనా సోకి, ఆ తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు మహమ్మారి బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్ లైన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement