Thursday, March 28, 2024

కొత్త సినిమాల టిఆర్పీ రేటింగ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !!

కొన్ని సినిమాలు వెండితెరపై సత్తా చూపలేకపోయాయినా బుల్లితెరపై మాత్రం ఆదరగొడుతూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు వెండితెరపై మెరిసినా బుల్లితెర పై మాత్రం ఆకట్టలేవు. ఇదిలా ఉండగా గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా టిఆర్పీ రేటింగ్స్ లో అదే స్థాయిలో దూసుకెళ్తుంది. టీవీలలో ఐదు సార్లు ఈ సినిమా టెలికాస్ట్ అయింది. మొదటిసారి 23.4 టిఆర్పీ రాగా ఐదవసారి 6.41 టిఆర్పి అందుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన రవితేజ గోపీచంద్ సినిమా క్రాక్ మొదటి సారి 11.71 టిఆర్పి సాధించగా రెండవసారి 7.52 టిఆర్పి సాధించింది.

మరోవైపు రామ్ రెడ్ సినిమా థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయింది. అయితే టీవీ లలో సక్సెస్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఈ సినిమాకు ఆదరణ కరువైంది. మొదటి సారి 5.0 2 టిఆర్పీ వచ్చింది. అలాగే బంగారు బుల్లోడు సినిమాకు కేవలం 2.42 టిఆర్పీ మాత్రమే సాదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement