Friday, May 3, 2024

నంద్యాల మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో గురువారం అవినీతి నిరోధక శాఖ సోదాలు కలకలం రేపాయి. నంద్యాల మైనర్‌ ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జాకబ్‌ రాజశేఖర్‌ ఇంట్లో తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు- గుర్తించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో ఎమ్మిగనూరు , కడప, నంద్యాలలో ఉంటు-న్న ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏకకాలంలో తనిఖీలు నిర్వ‌హించారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల,ఎమ్మిగనూరు, కడపలలో అధికారులు సోదాలు నిర్వహించగా, జాకబ్‌ రాజశేఖర్‌ ఇంట్లో బంగారు, నగదుతో పాటు- వివిధ ప్రాంతాలు ఆస్తులకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు- సమాచారం. ఆయనకు కర్నూలు, కడపతో పాటు- వివిధ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు- గుర్తించారు. రెండు లాకర్లు ఉన్నట్లు- గుర్తించామని వాటిని ఓపెన్‌ చేసిన తర్వాత పూర్తి వివరాలను వెల్ల‌డిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement