Saturday, April 20, 2024

RRR: ‘నాటు..నాటు.. ఊర నాటు..’ యూట్యూబ్ లో రచ్చ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకక్కుతున్న మూవీ ‘RRR’. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న సినిమా విడుద‌ల కానుంది. ఇటీవల విడుదలైన ‘నా పాట సూడు.. నాటు నాటు..’ పాట షేక్ చేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డ్యాన్స్ కేక పుట్టిస్తోంది. చెర్రీ, తారక్ ల డ్యాన్స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘నాటు.. నాటు..’ పాటలో ఈ ఇద్దరు టాప్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో డ్యాన్స్ చేసిన దుమ్ము దులిపారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో షేక్ చేస్తోంది. రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సాంగ్ 20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ను వెండి తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Radhe Shyam: నా చావుకి వారే కారణం: ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్

Advertisement

తాజా వార్తలు

Advertisement