Sunday, April 28, 2024

Temple Rush:ముక్కోటి శోభ..ఆల‌యాల‌కు క్యూ కట్టిన వీఐపీలు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయాల్లో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను చూసేందుకు వేలాదిగా భక్తులు కదిలి వచ్చారు.

వేడుకల్లో భాగంగా ఈ రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 12 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మరోవైపు తమిళనాడులోని శ్రీరంగ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. స్వామివారిని ద‌ర్శించుకునేందుకు వీఐపీలు క్యూలు క‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement