Friday, May 17, 2024

“నేను మీ బానిస‌ను కాను…. ద‌మ్ముంటే నా మీద పోటీ చేయ్” – ప‌వ‌న్ కు ముద్ర‌గ‌డ స‌వాల్

కిర్లంపూడి – నేను మీకు బానిస‌ను కాను.. ద‌మ్ముంటూ నా మీద పోటీ చేయమంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం స‌వాల్ విసినారు.. ఈ మేర‌కు ఆయ‌న 12 ప్ర‌శ్న‌లు సందిస్తూ బ‌హిరంగ లేఖ రాశారు.. ఇటీవల పవన్ ను విమర్శిస్తూ ముద్ర‌గ‌డ‌ రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై జనసేన నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అయనప్పటికీ ఏ మాత్రం తగ్గని ముద్రగడ ఈరోజు పవన్ కు సవాల్ విసురుతూ మరో ఘాటు లేఖను సంధించారు. ముద్ర‌గ‌డ ఘాటుగానే స్పందించారు..

అభిమానులతో బండ బూతులు పెట్టిస్తే.. లొంగిపోతానా? సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో కాదు .. మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదని లేఖలో కౌంటరిచ్చారు. ‘ మీరు సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదు.. నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు ఎందుకొచ్చింది. నీ వద్ద నేను నౌకరిగా పనిచేయడం లేదు కదా.. అటువంటప్పుడు నన్ను తిట్టించాల్సిన అవసరం ఏంటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు.
తాను ఎప్పుడూ మీ గురించి ప్రతికలలో ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదని… కానీ, కాకినాడ ఎమ్మెల్యేతో పాటు తనను తిట్టడం తప్పో, రైటో మీరే గ్రహించుకోవాల‌ని ముద్రగడ అన్నారు. మీ అభిమానుల చేత బండ బూతులతో తనకు మెసేజులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మెసేజులకు భయపడి తాను లొంగడమనేది జన్మలో జరగని పని అని చెప్పారు. తనను తిట్టాల్సిన అవసరం మీకు గానీ, మీ అభిమానులకు గానీ ఏమొచ్చిందని ప్రశ్నించారు.
‘గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే మీరు తిట్టండి. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది? నేనేమీ మీకు బానిసను కాను. నా శ్రీమతి మంగళసూత్రం తెంపి.. లంజా రావే అని పోలీసులు బూటు కాలితో తన్నినప్పుడు మీరు అడగలేదే?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ‌తంలో మీరు కాపుల‌కు చేసిందేమిటంటూ ప‌వ‌న్ ను నిల‌దీశారు..
పూర్తి లేఖ సారాంశం మీకోసం..

Advertisement

తాజా వార్తలు

Advertisement