Friday, May 10, 2024

RRR విడుదలలో మరింత జాప్యం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆగోగ్య పరిస్థితిపై సీఐడీ కోర్టు ఆరా తీసింది. ఆస్పత్రి నుచి డిశ్చార్జి సమర్మరీని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ కోరారు. అయితే, ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

రఘురామను ఈరోజు విడుదల చేసే అవకాశం ఉండటంతో తొలుత ఆయన తరుపు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామను విడుదల చేయాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మెజిస్ట్రేట్ కు తెలపడంతో రఘురామ విడుదల వాయిదా పడింది.

కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని తెలిపారు. అప్పటి వరకు బెయిల్‌పై విడుదల వీలుకాదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

కాగా, ఏపీ సీఐడీ పెట్టిన రాజ‌ద్రోహం కేసులో రఘురామకు ఈ నెల 21న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శనివారమే రఘురామ విడుదలవుతారని అంతా అనుకున్నా.. ప్రక్రియలో ఆలస్యంతో సోమవారం విడుదల కానున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ తరపు న్యాయవాదులు కింది కోర్టులో సోమవారం పూచీకత్తును సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రఘురామ‌ రూ.లక్ష వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement