Sunday, October 6, 2024

Tirumalaలో ప్రధాని మోడీ… రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో గవర్నర్, సిఎంల ఘన స్వాగతం

తిరుమల – తెలంగాణలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని రోడ్డు మార్గం ద్వారా తిరుమల పయనమయ్యారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మోడీ ఈ రాత్రికి తిరుమలలోని రచన గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement