Saturday, May 4, 2024

మిల్లెట్స్ కు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఆంధ్రప్రదేశ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: సాగులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యవసాయశాఖ చిరుధాన్యాలకు ఆంధ్రప్రదేశ్ ను చిరునామా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోషకాలు ఎక్కువగా ఉండే మిల్లెట్స్ ను సేంద్రియ పద్ధతిన సాగు చేసి.. ప్రజల ఆరోగ్య స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోషకాహార లోపాలను అధిగమించేలా బయోఫోర్టిఫైడ్‌ ఫుడ్స్‌(ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉం డే ఆహార ఉత్పత్తులు)ను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

2023ను ఐక్యరాజ్య సమితి చిరు ధాన్యాల సంవత్సరంగా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ పోషకాహార ఉత్పత్తుల పెంపుదలకు ప్రాధాన్యమిస్తున్నాయి. రోజువారీ ఆహారంలో సంప్రదాయ ఆహార పదార్థాలకు చోటుండేలా ప్రజలకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తారు. సంప్రదాయ సేంద్రియ ఉత్పత్తుల తయారీని చేపట్టి.. నెట్‌వర్కింగ్‌ సంస్థల ద్వారా ప్రజలకు అందిస్తారు. సూక్ష్మ పోషకాలైన ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 ఉన్న ఫోర్టిఫైడ్‌ సూక్ష్మ పోషకాలను కలిపి ఆహారంగా తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 5 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలు సాగవుతున్నాయి.

వచ్చే మూడేళ్ల లో దీన్ని రెట్టింపు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టు-కుంది. ఉత్పత్తి పెంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేప ట్టింది. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకో వడంతో పాటు-, కొత్తగా నీటి పారుదల వసతి కల్పించేందుకు ప్రణాళికలను వ్యవసాయ శాఖ రూపకల్పన చేసింది సమతుల ఎరువుల వాడకంతో భూసారాన్ని పెంచేలా చేయడం, వ్యవసాయ ఉత్పత్తులు పొలాల్లోంచే మార్కె ట్లకు చేరేలా అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు- చేయడం, ఆకలి, దారిద్ర్యం లేని ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేసేలా వ్యవసాయ శాఖలు ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచే స్తాయి. ఇలాంటి చర్యలతో రానున్న కాలంలో ఆహార ధాన్యా లు.. ప్రత్యేకించి చిరుధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. సుస్థిర వ్యవసాయం, సేంద్రియ సాగు కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వ సహకారంతో నడుస్తున్న ‘ప్రతి నీటి చుక్కకూ అదనపు పంట’ ‘పరంపరాగత్‌ కృషీ వికాస్‌ యోజన’ విజయవంతం గా అమలయ్యేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement