Friday, May 17, 2024

నాడు – నేడు పథకం విద్యార్థులకు ఒక వరం

కర్నూలు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య పేర్కొన్నారు. శనివారం 32వ వార్డు ముజఫర్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1.91 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 16 అదనపు తరగతి గదుల నిర్మాణానికి మేయర్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కమిషనర్ ఏ.భార్గవ్ తేజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముజఫర్ నగర్ పాఠశాలలో రూ.12 లక్షల చొప్పున 16 గదులను నిర్మిస్తున్నామన్నారు. కర్నూలు నగరంలోని 16 మున్సిపల్, జెడ్పీ పాఠశాలల్లో రూ.13.48 కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అందులో 2 పాఠశాలల్లో అదనపు గదులు, ఆధునీకరణ పనులు, మరో రెండు పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు, మిగిలిన 12 పాఠశాలల్లో ఆధునీకరణ పనుల నిర్మాణాలు వివిధ దశాల్లో ఉన్నాయన్నారు.వాటన్నింటిని త్వరలో పూర్తి చేస్తామని వివరించారు.

గత ప్రభుత్వాల హాయంలో పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని కోరారు. నాడు-నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి అనేక పథకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాకు పెద్దపీట వేశారన్నారు. త్వరలో కర్నూలు నగరంలో ఒక పాఠశాలను ఎంపిక చేసి అద్భుతంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  మాట్లాడుతూ నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుతున్నాయన్నారు.పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ ఉండాలని, దీనిని ఉపాధ్యాయులే నేర్పియాలన్నారు.పాఠశాల గదులు, మరుగుదోడ్లు, మైదానాలు పరిశుభ్రంగా ఉండాలని, దీనిని విద్యా కమిటి యే పర్యవేక్షించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement