Sunday, April 21, 2024

రాష్ట్రానికి శాపంగా ఉన్మాది పాలన, బాదుడే బాదుడులో నెంబర్‌ వన్‌: మహానాడులో చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రానికి ఒక ఉన్మాది శాపంగా మారింది. ఒకే ఒక్క ఛాన్స్‌ అంటే.. కరెంటు- తీగను ముట్టు-కున్నట్లే అయింది. మూడేళ్లలో బాదుడే బాదుడు మినహా జరిగిందేమీ లేదు. విద్యుత్‌ ఛార్జీల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరల వరకూ అన్నీ బాదుడే. టీ-డీపీ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీ-న్లు, బీసీలకు ఆదరణ పథకం కింద పనిముట్లు- ఇవ్వడం, పెళ్లికానుక, సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, రంజాన్‌ తోఫా ఇలా గత ప్రభుత్వం అమలు ఇలా ఏవైనా ఉన్నాయా? నాడు రైతులకు ఒకే దఫా రూ.50 వేల రుణాలు మాఫీ చేస్తే…ఇప్పుడు ఏడాదికి రూ.7 వేలు ఇస్తున్నారు. పైగా రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తామంటు-న్నారు. ఎన్టీఆర్‌ మోటార్లకు మీటర్లు తీసేస్తే సీఎం జగన్‌ మళ్లీ మీటర్లు పెడుతున్నాడు. మోటార్లకు మీటర్లు ఎలా పెడతారో చూద్దాం. రైతులు రోడ్డెక్కండి. అండగా తెలుగుదేశం పార్టీ ఉంటు-ంది. ఈ కష్టాలన్నీ పోవాలంటే క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అన్న నినాదం ప్రజలందరి గుండెలకు చేరాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా పిలుపునిచ్చారు.

శుక్రవారం ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రసంగించారు. మహానాడు తెలుగువాడి పండగని, తెలుగుజాతి ఉన్నంతవరకూ ఉండే ఏ-కై-క పార్టీతెలుగుదేశమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ రైతు నాగలి, పేదోడి గుడిసె, కార్మిక చక్రం చిహ్నాలతో రూపొందించిన పసుపు పతాకం ఎప్పటికీ నిలిచి ఉంటు-ందని స్పష్టం చేశారు. మూడేళ్లలో కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురిచేశారని, పోలీసులతో కేసులు పెట్టించారని, పార్టీనే లేకుండా చేస్తామన్నారని గుర్తు చేశారు. ఇలాంటి బెదిరింపులు, తాటాకు చప్పుళ్లు తెలుగుదేశం కార్యకర్తల ముందు పనిచేయవని స్పష్టం చేశారు. అనేక మహానాడులు చూశానని, ఈ మహానాడులో ఉన్నంత ఉత్సాహం, అభిమానం ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రంపరువుపోయిందన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, కానీ ఈ రోజున్నతను కరడుగట్టిన ఉన్మాది అని, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెట్టడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీజీపీనుంచి కానిస్టేబుల్‌ వరకు ఆలోచించాలని, ఇతన్ని నమ్ముకుని తప్పులు చేసేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. టీ-డీపీ హయాంలో ధరలు పెరిగాయా? తెలుగుదేశం హయాంలో విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయా?అని, ఒక్క పైసా అయినా పెంచామా అని చంద్రబాబు అడిగారు.

కానీ ఇప్పుడు కోతలు కోసేసి ఇచ్చే విద్యుత్తుకూ వాతలు పెట్టేశారని విమర్శించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అందరిపైనా బాదుడే బాదుడు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇటీ-వలే కేంద్రం కొంత తగ్గిస్తే.. కొన్ని రాష్ట్రాలూ తగ్గించాయని, కానీ మన రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదని ధ్వజమెత్తారు. అమ్మఒడి పెట్టి నాన్న బుడ్డికి దానికంటే భారీగా లాగేశారన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్‌ సగం ఎగ్గొట్టేశారని, విదేశీ విద్యకు మంగళం పాడేశారని దుయ్యబట్టారు. ఒకపక్క బాదుడు, మరోవైపు సంక్షేమంలో కోతలు, ఇంకోవైపు ఆగిపోయిన అభివృద్ధి అని చంద్రబాబు వివరించారు. అయినా అప్పులు మాత్రం రూ.8లక్షల కోట్లకు చేరాయన్నారు.

ప్రత్యేక హోదా ఏమైంది?
కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేకహోదా తెస్తామని ఎన్నికల ముందు చెప్పారని, ఇప్పుడు ఆ హోదా ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. మద్యనిషేధం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి చేసిందేంటని, నాసిరకం మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో జగన్‌ దిట్ట అని, ఎన్నికల ముందు బాబాయ్‌ హత్య గుండెపోటు-తో అని చెప్పారని, గొడ్డలిపోటు-ను గుండెపోటు- చేసి సానుభూతి కొట్టేసే రాజకీయం చేశారని విమర్శలు చేశారు. కోడికత్తి వ్యవహారం కూడా అదేనన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేశారని, ప్రతిపక్షాలు పోరాడటంతో అరెస్టు చేశారన్నారు. దళితుల్లో వ్యతిరేకత రావడంతో కోనసీమ జిల్లా వ్యవహారంతో చిచ్చుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. అంబేద్కర్‌ అందరికీ కావాల్సిన వ్యక్తి అని, వైసీపీకి మాత్రం ఆయనపై ప్రేమలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో ప్రతిపాదించిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్నే నిర్మించి ఉండేదన్నారు. అమరావతిని హైదరాబాద్‌లా చేయాలనుకున్నా నిన్న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ వచ్చి ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారని, ఆయన తన పేరు చెప్పకున్నా, అది తాను సీఎంగా ఉన్నప్పుడు వచ్చిందని ప్రస్తావించకున్నా ఫర్వాలేదని చంద్రబాబు అన్నారు. సీఎంగా పిలవడంతో హైదరాబాద్‌ వచ్చి పరిశీలించారని, సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పడంతో.. అన్ని రాష్ట్రాలు తిరిగి కూడా హైదరాబాద్లోనే పెట్టారని గుర్తు చేశారు. తన హయాంలో వచ్చిన జీనోమ్‌ వ్యాలీ ఇప్పుడు మానవాళిని రక్షించిన కోవిడ్‌ టీ-కా తయారైందని తెలిపారు.

అమరావతిని కూడా అలాగే చేయాలని సంకల్పించానని, కానీ జగన్‌ నాశనం చేశారని మండిపడ్డారు. అయిపోయిన పెళ్లికి బాజాలన్నట్లు-గా టీ-డీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలకు మళ్లీ ప్రారంభాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అంటేనే బీసీలు.. ఇటీ-వల వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటిస్తే అందులో నలుగురు ఒకే సామాజికవర్గం నేతలున్నారని, ఒక సీటు-ను తెలంగాణకు చెందినతెలుగుదేశం పార్టీ మాజీ నేతకు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో 12 కులాల్ని బీసీ జాబితానుంచి తీసేస్తే ఒక్క మాట మాట్లాడని వ్యక్తి ఆయన అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలని, ఈ వేదిక మీద ఉన్న నాయకులే దానికి నిదర్శనమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఈ కార్యకర్తలేనని, కార్యకర్తల సంక్షేమం కోసం ఏదైనా చేస్తానని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వేదికపైనన్న అచ్చెన్నాయుడితో సహా పలువురు బీసీ నేతల్ని అరెస్టు చేసిందని, కుటు-ంబసభ్యులను అరెస్టు చేస్తే తనకు నిద్ర కూడా పట్టలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 40 శాతం యువతకు సీట్లిస్తామని, పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement