Thursday, April 25, 2024

రుతుప‌వ‌నాలొస్తున్న‌య్‌.. రెండు, మూడు రోజుల్లో కేర‌ళ‌కు చేరుకుంట‌య్‌

భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయని ప్ర‌క‌టించింది. అయితే ముందుగా కేరళ తీరాన్ని రెండు రోజుల్లో తాకనున్నట్లు వెల్లడించింది ఐఎండీ. నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ వెల్లడించింది. రాబోయే 5 రోజులు దేశంలో వడగాలుల పరిస్థితులు ఉండవ‌ని తెలిపింది.

పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని.. వచ్చే 2 రోజులు ఢిల్లీలో ఆకాశం మేఘావృతమైన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని వెల్లడించింది. 24 గంటల్లో కేరళ తీరం, ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాల ఉనికి పెరిగిందని తెలిపింది. ఈ సారి సాధారణం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement