Saturday, May 4, 2024

RRR: థియేటర్‌లో గన్‌తో వ్యక్తి హల్‌ చల్‌

పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే, థియేటర్లలో ఓ వ్యక్తి మాత్రం గన్‌తో హల్ చల్ చేశారు. దీంతో ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్‌లోకి ఒక వ్యక్తి గన్‌తో వచ్చాడు. తుపాకీ చేత్తో పట్టుకుని అటూఇటూ తిరగడంతో ప్రేక్షకులు కొంత భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అతడి చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీగా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement