Wednesday, May 1, 2024

శ్రీశైలంలో మహా ఉగాది వేడుకలు.. అమ్మవారికి మహాదుర్గ అలంకారం

భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల కొలువై ఉన్న శ్రీశైలంలో గురువారం మహా ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

అంతకుముందు అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఇక నేటి రాత్రి 7.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ పూజలు, అమ్మవారికి మహాదుర్గ అలంకారం నిర్వహిస్తారు. ఇక రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం, రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ కార్యక్రమాలు చేపడుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement