Wednesday, May 1, 2024

బందరు పోర్టుకు మంచి రోజులు..

అమరావతి, ఆంధ్రప్రభ: బందరు ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న పోర్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పోర్టు పనులకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది. మే మూడో వారంలో బందరు పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి. మూడేళ్ళలో పనులు పూర్తి చేసే విధంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. నాలుగు నెలల క్రితమే బ ందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతుల్ని మంజూరు చేసింది. మార్చి నెలలోనే పనులు ప్రారంభించాలని భావించిన ప్పటికీ వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. సుమారు 17 ఏళ్ళుగా పోర్టు పనులు మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు చందంగా సాగాయి. ఈ క్రమంలో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పోర్టు పనుల్లో కదలిక వచ్చింది. ఫైనాన్సియల్‌ క్లోజర్‌ రూ.4,500 కోట్ల రుణం మంజూరు చేసేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ముందుకు వచ్చింది. బందరు పోర్టుకు నాలుగు దశాబ్ధాల చరిత్ర ఉంది. కాలక్రమంలో అది కనుమరుగై పోయింది. తూర్పు తీరంలో తొలి వ్యాపార కేంద్రాన్ని ఆంగ్లేయులు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. డాచ్‌, పోర్చుగీసు వారు కూడా మచిలీపట్నాన్ని వ్యాపార స్థావరంగా మార్చుకున్నారు.

బందరు పోర్టువల్ల పెద్దగా లాభం ఉండదని భావించిన ఆంగ్లేయులు పోర్టు కార్యకలాపాలను చెన్నైకు మార్చుకున్నారు. 1984 వరకు మచిలీపట్నం పోర్టులో అరకొరగా సాగిన కార్యకలాపాలు ఆ తరువాత నిల్చిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టారు. 2008 ఏప్రిల్‌లో పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. నవయుగ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఆయన మరణానంతరం పోర్టు పనులకు గ్రహణం పట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని వైఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ కింద ముద్ర వేసి పక్కన పడేసింది. ఆ తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సైతం పోర్టు పనులపై దృష్టి సారించలేదు. దీంతో మచిలీపట్నం పోర్టు ఓ కమ్మని కలగా మారింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోర్టు నిర్మాణ పనులపై దృష్టి సారించారు.

నవయుగ నిర్మాణ సంస్థతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ప్రభుత్వం రంగ సంస్థలతో కన్సర్షియమ్‌ ఏర్పాటు చేసి పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ సంస్థకు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించారు. మారీటైం బోర్డు నిర్మాణ పనుల్ని పర్యవేక్షించనుంది. 1926 ఎకరాల్లో తొలిదశలో రూ.3650 కోట్లతో నాలుగు బెెర్త్‌ల్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలిదశలో వివిధ సరకు రవాణా కు వినియోగించేలా నాలుగు బెర్త్‌ల్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒకటి మల్టిdపర్పస్‌ బెర్త్‌ కాగా రెండు జనరల్‌ కార్గో బెర్త్తలు, మరొకదాన్ని బొగ్గు కోసం కేటాయించనున్నారు. 2.99 కిమీ బ్రేక్‌ వాటర్‌, 43.82 మిలియన్‌ మీటర్ల డ్రెజింగ్‌తో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయనున్నారు. మూడేళ్ళలో పోర్టు నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా రూ. 5838 కోట్లు ఖర్చుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. వచ్చే నెల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోర్టు నిర్మాణ పనుల్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఒక్క ఎకరా భూ సేకరణ చేయకుండానే – మాజీమంత్రి పేర్ని నాని
దాదాపు 17 ఏళ్లుగా బందరు ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తు న్న మచిలీపట్నం పోర్టు ను వైసీపీ ప్రభుత్వం కట్టబోతోందని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ‘ఆంధ్రప్రభ’కు తెలిపా రు. ఒక్క ఎకరా భూసేకర ణ చేయకుండానే పోర్టు నిర్మాణం చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో అర్ధరాత్రి పూట జీవోలు జారీ చేసిన చంద్రబాబు, పోర్టు పేరుతో 22 గ్రామాల్లో దాదాపు 33 వేల ఎకరాల భూములు బలవంతంగా సేకరించాలని చూశారన్నారు. దీంతో ఆ గ్రామాల వారు తిరగబడి, కోర్టులను ఆశ్రయించారన్నారు. తమ ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా సేకరించ కుండానే, రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, బందరు పోర్టు నిర్మిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement