Wednesday, May 1, 2024

సమాజ హితం కోరే సాహిత్యం తరతరాలు నిలిచిపోతుంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్నం (ప్రభన్యూస్‌): ఒక దేశ వైభవాన్ని, ఆ దేశ సాహిత్యం ప్రతిబింబిస్తుందని, తర తరాలు నిలిచిపోయేది ఉత్తమ సాహిత్యమని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు భావించారు. సాహిత్య సృష్టి సమాజ హితంను ఆశించి జరగాలని ఆయన అభిలషించారు. తెలుగుతో పాటూ ప్రతి మాతృభాషను కాపాడాలన్నదే ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలోని సాహిత్య సంస్థ విశాఖ సాహితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల లోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సంచికను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోరే ఉత్తమ సాహిత్యమే తర తరాలు నిలిచిపోతుందన్నారు. రామాయణ, భాగవత, భారతంలు అందుకే ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి నేటికే స్ఫూర్తిని నింపుతున్నాయన్నారు. తాను ఎంతగానో అభిమానించే విశాఖపట్నంలో మరింత అభిమానించే తెలుగు సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగాఉందన్నారు. 50 ఏళ్లుగా సంస్కృతి సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న విశాఖ సాహితి సంస్థ కు ఆయన అభినందనలు తెలిపారు. కవులు, రచయిత లు, మేధావులు, విలేఖరులు రాసే ప్రతి అక్షరంలోనూ సమాజ హితం ఉండాలని ఆయన కాంక్షించారు.

అందుకే భారత దేశాన్ని రామాయణ భూమిగా, వాల్మీకి భూమిగా పాశ్చాత్య ర చయితలు సై తం అభివర్ణించారని అన్నారు. సాహిత్యం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని, దీనికి తగ్గట్టుగా రచయితల చొరవ మరింత పెరగాలన్నారు. జానపదం, సాహిత్యంను నిలబెట్టుకోగలిగితే సంస్కృతిని నిలబెట్టుకున్నట్లేనని చెప్పారు. ఎంతో ప్రాచీనమైనదైన తెలుగు భాష మన భాష కావడం ఆన ందదాయకం అన్నారు. వస్త్రధార ణ, ఆహారపు అలవాట్లు, పండుగలు, ఆచార వ్యవహారాలు, వృత్తులు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని సాహిత్యంలో ప్రతిబింబిస్తున్నప్పుడు ఘనమైన సాహితీ సంపదను పరిరక్షించుకునే అవకాశం ఉందన్నారు.

తెలుగు భాష అభివృద్ధిని మాత్రమే తాను కోరుకోవడం లేదని, అన్ని మాతృభాషలూ తమ మనుగడను నిలబెట్టుకోవాలన్నదే తన ఆకాంక్షగా ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో ఉన్న 920 పాఠశాలల్లో కోయ భాష ప్రాథమిక విద్యా బోధన చేస్తున్నారని అన్నారు. తెలుగు లిపి ద్వారా కోయ భాషను సంరక్షించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం, విద్యా శాఖ అధికారుల చొరవను ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందేనన్నారు. మాతృభాషలోని మాధుర్యంను పిల్లలకు పంచడం ద్వారా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ సాధ్యం అవుతుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పిల్లల సాహిత్యం మీద రచయితలు దృష్టి కేంద్రీకరించాలన్నారు. పిల్లలకు తెలుగు భాషను తెలుగు సంస్కృతిని అల వాటు చేసే విధంగా నూతన మార్గాల అన్వేషణ సాగాలని ఆయన ఆశించారు.

తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యంను గడప గడపకూ చేర వేసే ఆశయంతో 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశాఖ సాహితి సేవలను అభినందించిన ఉప రాష్ట్రపతి వెయ్యికి పైగా సభలు నిర్వహించిన ఈ సంస్థ 1971లో ఉద్భవించినట్లుగా గుర్తు చేసారు. విశాఖ సాహితి సంస్థకు చెందిన సభ్యులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకోవడం, సినిమా రంగంలో రచయితలూ నటులుగానూ స్థిరపడంం ముదావహం అన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ప్రసాద రెడ్డి, విశాఖ సాహితి అధ్యక్షురాలు ఆచార్య కోలవెన్ను మలయవాసిని, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కందాళ కనక మహాలక్ష్మి, కార్యదర్శి ఘండికోట విశ్వనాథం సహా పలువురు విశ్వవిద్యాలయం ఆచార్యులు, సాహి తీ వేత్తలు, రచయితలూ తెలుగు భాషాభిమానులూ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement