Tuesday, May 7, 2024

Liquor Scam – మ‌ద్యం అమ్మ‌కాల‌తో రూ 36వేల కోట్ల స్వాహా – సిబిఐ విచార‌ణ‌కు పురందేశ్వ‌రీ డిమాండ్ ..

అమ‌రావ‌తి – రాష్ట్రంలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందన్నారుబీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి . రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ద్వారా రూ.20వేల కోట్ల ఆదాయం వస్తోందని చెబుతున్నారని, కానీ వాస్తవానికి రూ.56,700 కోట్లు వస్తోందని చెప్పారు. మిగిలిన రూ.36,700 కోట్ల సొమ్ము ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్త నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. మద్యం ద్వారా దోచుకున్న తీరుపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దోచుకుంటున్నారన్నారు.

ఇక పొత్తుల‌పై ఆమె మాట్లాడుతూ, టిడిపి, జ‌న‌సేన‌, బిజెపి పొత్తులపై సమయాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. టీడీపీతో పొత్తుపై తమ పార్టీ అధిష్ఠానానికి వివరిస్తానని పవన్ చెప్పారన్నారు. పవన్ వివరణను బట్టి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నానని చెప్పారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement