Sunday, May 26, 2024

పంచలింగాల చెక్ పోస్టు వద్ద రూ. 3 కోట్ల‌ నగదు స్వాధీనం…

కర్నూలు బ్యూరో, – కర్నూలు నగర శివారులోని పంచలింగాల ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు వద్ద శుక్రవారం సెబ్, తాలుకా పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బి.ఎ చేతన్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పఅందించిన వివరాల ప్ర‌కారం బెంగుళూరుకు చెందిన చేతన్ కుమార్ చెన్నైకు చెందిన‌ అరుణ్ వ‌ద్ద‌ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతని పై నమ్మకంతో అరుణ్ అత‌డిని రాయ్ పూర్ కు విమానంలో మార్చి 28 న పంపించాడు. ను బెంగళూరు నుండి రాయపూర్ కు వెళ్ళిన తర్వాత రాయపూర్ నుండి రాయఘడ్ లోని త్రీ స్టార్ హోటల్ శ్రేష్టలో సుమారు 10 రోజుల పాటు ఉన్నాడు. అక్కడే ఇతనిని కొంతమంది కలిసి అతనికి పెద్ద మొత్తంలో నగదు అప్పగించారు. ఏప్రిల్ 8 వ తేది ఆ నగదును తీసుకుని రాయఘర్ నుండి బిలాస్ పూర్ కు వెళ్ళి మరల బిలాస్ పూర్ లో పని జరగక నుండి తిరిగి రాయపూర్ వెళ్ళి అక్కడి నుండి ప్రవేట్ ట్రావెల్ బుక్ చేసుకుని హైదరబాద్ కు వచ్చాడు. అక్కడి నుండి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఎస్ ఆర్ ఎస్ ట్రావెల్స్ బస్సులో కర్నూలు వైపు మీదుగా బెంగుళూరు కు బయలు దేరాడు. వాహనాల తనిఖీలలో కర్నూలు పంచలింగా ల చెక్ పోస్టు దగ్గర ఏటువంటి బిల్లులు లేకుండా ఉన్న రూ. 3 కోట్ల 5 లక్షల 35 వేల 5 వందల నగదు ను చేతన్ కుమార్ వద్ద గుర్తించి సెబ్ సిఐ లక్ష్మీదుర్గయ్య , తాలుకా సిఐ మరియు ఎస్సైలు తమ సిబ్బంది తో భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారించగా తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో ఉన్న రామచంద్ర మెడికల్ కళాశాల చెందిన వారిదని చేతన్ కుమార్ తెలిపారు. ఆ డబ్బు కు సంబంధించిన ఆధారాలు గాని, వివరాలు గాని పూర్తి స్ధాయిలో లభించకపోవడంతో ఈ విషయంపై కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న నగదు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారికి అప్పగిస్తున్నామన్నారు. కాగా, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. ఈ రెండు నెలల్లోనే కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఇప్పటివరకు జరిగిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో , లోకల్ పోలీసుల తనిఖీలలో 8 కోట్ల నగదు, 25 కేజిల బంగారం, 12 కేజిల వెండి, 500 గ్రాములు డైమండ్స్ పట్టుబడ్డాయన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 10 అంతర్ జిల్లా చెక్ పోస్టులు, 5 స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి , స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్, కర్నూలు సెబ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య, కర్నూలు తాలుకా సిఐ విక్రమసింహా, తాలుకా ఎస్సై ఖాజా వళి లు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement