Sunday, April 28, 2024

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది : సివిల్ జడ్జిలు

నందికొట్కూర్ రూలర్ : జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, తద్వారా పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని, కాలుష్య రహిత సమాజం సాధ్యమవుతుందని నందికొట్కూరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు తిరుమల రావు, రాజారామ్ అన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పర్యావరణ చట్టాలు అమలు జరగాల్సి ఉందన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ సందర్భంగా శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ. అడవులు దెబ్బతింటున్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో గతంలో 38 శాతం అడవులుండేవి.. ప్రస్తుతం అవి 25 శాతానికి పరిమితమయ్యాయి. కార్పొరేట్‌ ద్వారా అడవుల్లో సహజ తత్వాన్ని నాశనం అవున్నాయ‌ని, తద్వారా జీవావరణ వ్యవస్థ నిర్వీర్యమవుతోంద‌న్నారు. దీంతో పర్యావరణలో మార్పులు సంభవిస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతలతోపాటు వర్షాకాలం తీరు మారుతోంద‌న్నారు. తుపాన్ల దిశ పూర్తిగా గతి తప్పుతోంద‌న్నారు. తీర ప్రాంత జీవావరణ పరిరక్షణ చట్టం అమలు కావాలని అన్నారు.

భారీ పరిశ్రమలతో పాటు, సూక్ష్య, చిన్నతరహా పరిశ్రమల ప్రభావం పర్యావరణంపై పడుతోంద‌న్నారు. దీనివల్లే సముద్రాలు ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గతంలో సీఆర్‌జెడ్‌ చట్టం అనుమతి వచ్చిన తర్వాతనే పరిశ్రమలు వచ్చేవి.. ప్రస్తుతం పరిశ్రమలు పెట్టిన తర్వాత పర్యావరణ పరిస్థితులు, అక్కడ ఏర్పడే మార్పులపై అధ్యయనం చేస్తున్నారు. దీనివల్లే నది తీర ప్రాంతం దెబ్బతింటోంది. మత్స్యకార సంపద తగ్గిపోతోంది. పరిశ్రమల ఏర్పాటులో పర్యావరణ ప్రభావ నివేదిక(ఈఐఏ) ప్రధాన భూమిక పోషిస్తుంద‌న్నారు. ప్రస్తుతం దీనికి స్వస్తిపలికారు. పచ్చదనం ప్రణాళికలు అవసరం పట్టణాల్లో భారీ భవంతులకు అనుమతులు ఉన్నప్పటికీ పచ్చదనం కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత పురపాలికలపై ఉంద‌న్నారు. రోడ్లు వేసే సమయంలో చుట్టుపక్కల నాలుగు అడుగులు వదిలి, మొక్కలు పెంచాల్సి ఉంది. నిబంధనలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో. తాసిల్దార్ రాజశేఖర్ బాబు. మున్సిపల్ కమిషనర్ బేబీ ఎస్ఐ వెంకటరెడ్డి ప్రిన్సిపాల్ సిరాజుద్దీన్ న్యాయవాదులు భాస్కర్. వెంకట్రాముడు. ఆర్ఐ సత్యనారాయణ విఆర్వో వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement