Saturday, May 25, 2024

రూ. 1.04 కోట్ల విలువైన బంగారం, వజ్రాల పట్టివేత

కర్నూల్ బ్యూరో, – కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఈ ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రూ.1.04 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి వీటిని మధురై తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న బంగారం, ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పి, అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన దాడుల్లో ఇన్స్పెక్టర్ లక్ష్మీ దుర్గయ్య, ఎస్సై జిలాని భాష, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పిసీలు ఆన్సర్ భాష, సుధాకర్, విజయ భాస్కర్, శ్రీనివాసులు, సుభాన్ భాష, మనోహర్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement