Saturday, March 23, 2024

పంచలింగాల చెక్ పోస్టులో 5.03 కిలోల గంజాయి పట్టివేత.

కర్నూలు బ్యూరో, కర్నూల్ నగర సమీపంలోని పంచలింగల చెక్ పోస్ట్ వద్ద బుధవారం టిఎస్‌ఆర్‌టిసి ( ప్లస్ బేరింగ్ నంబర్ టిఎస్ 08 జెడ్ 0270 ) బస్సులో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తుల వద్ద 5.03 కిలోల గంజాయిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఖమ్మం జిల్లాలోని సంభాని నగర్ కు చెందిన 22 ఏళ్ల మున్నంగి హరీష్, శ్రీరామ్ నగర్ కు చెందిన 20 ఏళ్ల నూకల తేజ ఇరువురు కలిసి ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ అక్కడినుంచి బెంగళూరుకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ఎస్ఇ బి ఇన్స్పెక్టర్ ఎన్. లక్ష్మీ దుర్గయ్య నేతృత్వంలో పోలీసులు హైదరాబాద్ కి వస్తున్న గరుడ బస్సులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ బ్యాంగులో అక్రమంగా తీసుకెళ్తున్న గంజాయిని గుర్తించారు. రవాణాలో కీలక సూత్రధారి లైన నూకల తేజ హరీష్ లను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్, కర్నూలు మీదుగా గత కొంత కాలంగా గంజాయి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసు విచారణలో వెల్లడించారు. అనంతరం వీరిని అరెస్టు చేసిన పోలీసులు ఇరువురిని కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ గంజాయి అక్రమ రవాణా వెనుక వీరిద్దరితో పాటు మరి ఎంత మంది పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement