Saturday, April 20, 2024

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు

అనంత పురం క్రైమ్ – భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 130 జయంతి వేడుకలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం నాడు ఘనంగా జరిగాయి. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమానికి జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని… దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక అసమానతలు పోగొట్టిన మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించారు. రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్ధేశకుడిగా చరిత్రలో నిలిచారని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని ఎస్పీ గారు పిలుపునిచ్చారు. సమాజాన్ని సంస్కరించేందుకు అవతరించిన కారణజన్ములు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఓఎస్డీ రామకృష్ణప్రసాద్ , ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ ఎన్ మురళీధర్ , ఒన్ టౌన్ సిఐ ప్రతాపరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీశైలరెడ్డి, శివరాముడు, జిల్లా పోలీసు అధికారుల సంఘం సాకే త్రిలోక్ నాథ్ , జాఫర్ , తేజ్ పాల్ , పలువురు ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement