Friday, May 3, 2024

క‌ర్నూలు క్రికెట‌ర్ అంజలి శర్వాణీకి ఐపిఎల్ జాక్ పాట్

కర్నూలు, ప్రభన్యూస్‌బ్యూరో: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపిఎల్‌ 2023 వేలంలో కర్నూలు జిల్లాకు చెందిన అంజలి శర్వాణీ అదరగొట్టింది. ముంబాయి వేదికగా జరిగిన ఈ వేలంలొ శర్వాణీపై కాసుల వర్షం కురిసింది. అండర్‌-19 ఫార్మాట్‌లో సత్తాచాటి గతేడాది చివర్లో టీ-మిండియాలోకి అడుగుపెట్టిన అంజలిని యూపీ వారియర్స్‌ రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటికే టీ-మిండియాకు ఆడుతున్న అంజలి.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్‌లో టీ-మిండియా సభ్యురాలిగా ఉన్నారు. సోమవారం ముంబై వేదికగా జరిగిన వేలంలో ఈ లెఎn్టార్మ్‌ పేసర్‌ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అంజలీ కోసం యూపీ వారియర్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు- పోటీ- పడ్డాయి. అయితే చివరకు రూ. 55 లక్షలకు యూపీ వారియర్‌ సొంతం చేసుకుంది. టీ-మిండియాకు ఎంపి-కై-న తొలి లెఎర్మ్‌ పేసర్‌ అంజలి శర్వాణ కావడం విశేషం.


స్వింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టులో గుబులు…
కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన రమణా రావు, అనురాధ దంపతుల కుమార్తె అంజలి శర్వాణి. తండ్రి రమణారావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇక తల్లి అనురాధ సాధారణ గృహిణి, శర్వాణికి విక్రమాదిత్య అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అంజలి శర్వానికి చిన్నతనం నుంచి క్రీడల పట్ల మక్కువ. దీంతో క్రీడల్లోనైనా చురుగ్గా రాణించేది. పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో పాల్గొని తన సత్తా చాటుకునేది.ఇలా అథ్లెటిక్స్‌,లాంగ్‌ జంప్‌, ట్రిపుల్‌ జంప్‌ వంటి క్రీడల్లో 40 వరకు పథకాలు సాధించింది. ముఖ్యంగా అండర్‌ 16 జాతీయ పోటీ-ల్లో పాల్గొని తన ప్రతిభను చాటింది. ఆదోని పట్టణంలోని స్థానిక మిల్టన్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అంజలి శర్వాణి పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఆమె తల్లిదండ్రులు చదువులో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. అయితే క్రీడలపై ఆసక్తి ఉండడంతో ఆటల్లో ప్రతిభ కనబరుస్తూ ఇంటర్లో మాత్రం ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఇంటర్లో ఒక సబ్జెక్టు తప్పడంతో వివక్షతను ఎదుర్కుంది. అమ్మాయిలకు చదువే ముఖ్యం.. ఆటలేమిటీ అంటూ విమర్శలు ఎదురయ్యాయి. ఆటల కోసం -తిరిగితే భవిష్యత్తు పాడవుతుంది. ఇకనైనా చదువు మీద దృష్టి పెట్టించు అని ఆమె తండ్రి రమణ రావుకు చాలామంది బందువులు, స్నేహితులు హితవు పలికారు. దీంతో ఆ సమయంలో శర్వాణి తల్లిదండ్రులు కూడా ఓ దశలో కంగారుకు గురయ్యారు. ఆలోచనలో పడ్డారు. క్రీడల్లో ఆశించిన అవకాశాలు రాకపోతే తమ కుమార్తే భవిష్యత్తు ఏమిటని.. కంగారుపడిన సమయంలో ఉద్యోగం కోసం మనం వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. ఉద్యోగమే మనను వెతుక్కుంటూ వస్తుందని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది శర్వాణీ.
20 ఏళ్ల వయస్సుల్లోనే రైల్వేస్‌కు ఎంపిక…
తన 22 ఏళ్ల వయసులో రైల్వేస్‌కు ఏంపిక అయింది. 2012లో భారత -19 మహిళల క్రికెట్‌ జట్టు-కు ఎంపి-కై-న ఆమె ఆ తర్వాత 2012-13 సీజన్‌లో రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఆ తర్వాత క్రీడకోటలో రైల్వేలో ఉద్యోగం సంపాదించింది. అనంతరం 2019-20 మధ్య ఆంధ్రా జట్టు- తరపున ఆడింది . 2017-18 సీనియర్‌ మహిళల క్రికెట్‌ ఇంటర్‌ జోనల్‌ త్రీ డే గేమ్‌ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌ తరఫున ఆడిన అంజలి అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టు-కుంది. అలా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడంతో అంజలి శర్వాణి క్రికెట్‌ వైపు అడుగులు వేసి అంచలంచలుగా ఎదిగి భారత జట్టు-కు ఎంపి-కై- తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2020లో పాట్నా వేదికగా జరిగిన మహిళల టీ-20 క్వాడ్రాంగులర్‌ సిరీస్‌లో ఇండియా- బి జట్టు- తరపున ఆడి మంచి ప్రదర్శన కనబర్చింది. గత ఏడాది సీనియర్‌ టి20 క్రికెట్‌ ట్రోఫీలో పది మ్యాచ్‌ ల్లో 17 వికెట్లు- తీసి శభాష్‌ అనిపించుకుంది. ఆ రెండు నెలల వ్యవధిలో 20 మ్యాచ్‌ ల్లో 30 వికెట్లు- పడగొట్టి తన ప్రతిభను కనబరిచి అందరినీ ఆకట్టు-కుంది.అదే ఊపులో టీ-మిండియాలోకి అడుగుపెట్టింది. ఓవైపు క్రికెట్‌ ఆడుతూనే మరోవైపు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా బి.ఏ కూడా పూర్తి చేసింది. రోజంతా క్రికెట్‌ సాధన చేసే అంజలి శర్వాణి పరీక్షల సమయంలో మాత్రం విరామం తీసుకుని సన్నద్ధం అయ్యేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement