Sunday, May 5, 2024

KNL: జగ్గాపురంలో ఆర్మీ జవాన్ మిస్సింగ్

కర్నూలు జిల్లా నందవరం మండలం జగ్గాపురంలో ఆర్మీ జవాన్ మిస్సింగ్ అయ్యాడు. ఆర్మీజవాన్ చంద్రశేఖర్ ఏడాదికాలంగా కనిపించడం లేదు. సెలవులకు వచ్చి తిరిగి వెళ్లే ముందు రోజు నుంచి ఆర్మీ జవాన్ కనిపించడం లేదు. చంద్రశేఖర్ ఆర్మీకి తిరిగి రాలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. ఏడాది నుంచి తన కొడుకు కోసం ఆర్మీ జవాన్ చంద్రశేఖర్ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు నందవరం పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement