Tuesday, May 7, 2024

జగనన్న నుండి నన్ను వేరు చేయాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టను : బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

నందికొట్కూరు : గత నాలుగు రోజులుగా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, నారా లోకేష్ ను సీక్రెట్ గా కలిశారంటూ వస్తున్న ప్రచారాలను శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కొట్టిపడేశారు. ఆ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, త‌న ఊపిరున్నంత వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు మీడియాలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. గతంలో కూడా తాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్ లో మాట్లాడానని, నేడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నారా లోకేష్ ను కలిశానని తప్పుడు సమాచారంతో త‌మ వైసిపి కార్యకర్తలను, అభిమానులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయటం సరికాదన్నారు. తాను ఆపదలో ఉన్నప్పుడు, త‌నకు ఆశ్రయం ఇచ్చి త‌నను ఆదుకొని, త‌నకు ఇచ్చిన మాట ప్రకారం ఇంత గొప్ప స్థానం కల్పించిన ముఖ్యమంత్రి జగనన్నను తాను ఎప్పటికి దూరం చేసుకోనన్నారు. జగనన్న నుండి త‌న‌ను దూరం చేయాలని చేసే రోజు వచ్చిందంటే కూడా అది త‌మ పార్టీ వాళ్ళైన, ప్రతిపక్ష పార్టీ వారైనా ఎవర్ని లెక్కచేయకుండా వారి లెక్కలు తేలుస్తానన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగనన్న త‌నకు అప్పగించిన బాధ్యతలు ప్రశాంతంగా చేసుకుంటూ ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా పని చేస్తున్న త‌నకు ఎక్కడ ఏది జరిగినా త‌న‌పై కక్ష పూరితంగా తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలా చేసే వారి వల్ల కూడా త‌నపై ఎవరెవరు కక్ష సాదించాలనుకుంటున్నారో ముఖ్యమంత్రికి కూడా తెలుస్తుందన్నారు. గతంలో రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా కేసులు పెట్టారని, ఇబ్బందులు పెట్టారని, ఇన్ని జరిగినా త‌నను ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు జగనన్న అన్నారు. తాను రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యక్రమాల్లో, శాప్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ, అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాలు తిరుగుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలు చేపడుతున్నానన్నారు. దయచేసి తప్పుడు వార్తలు ఎవరు నమ్మొద్దు. మీడియా వారూ కూడా వాస్తవాలు చెబుతూ ప్రజలకు చూపించండి.. ఎవడో ఏదో అనుకున్నాడని, ఎవరో చెప్పారని అవాస్తవాలు ప్రసారం చేయకండని తెలిపారు. త‌నపై టీడీపీలో చేరుతున్నానని, నారా లోకేష్ ను కలిశానని వస్తున్న తప్పుడు ప్రచారాలపై, ప్రసారాలపై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుందన్నారు. వారిని అడిగినా ఒక క్లారిటీ అనేది ఇస్తుందన్నారు. రాష్ట్ర వైకాపా నేతలు, జగనన్న అభిమానులు, త‌న‌ అభిమానులు ఎవరు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సిద్దార్థ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement