Thursday, April 25, 2024

“పైనోడు మెలికేసి రాస్త‌డు”.. ఫుల్ ఎమెష‌న్స్ తో “ఏవీఏకే” ట్రైల‌ర్..

ఫ‌ల‌క్‌నుమా దాస్‌ సినిమాతో క్లాస్, మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యువ హీరో విశ్వ‌క్‌సేన్. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు ఈ మాస్ హీరో. విశ్వ‌క్ సేన్ న‌టిస్తోన్న తాజా చిత్రాం అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం. విశ్వ‌క్ కి జోడీగా రుష్క‌ర్ ధిల్లాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విద్యాసాగ‌ర్ చింత డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి.. ర‌వి కిర‌ణ్ స్క్రిప్ట్ అందించ‌గా.. ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. విశ్వ‌క్ సేన్‌కు పెళ్ల‌యిందా..? కాలేదా..? అనే దానిపై సస్పెన్స్ పెడుతూ సాగుతున్న ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement