Sunday, April 14, 2024

Nandyala : దొంగల ముఠా అరెస్ట్

నంద్యాల : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. పాణ్యం చెంచు కాలనీకి చెందిన ఆరుగురు దొంగలను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి వెల్లడించారు.

వారి వద్ద నుంచి రూ.2.10 లక్షల విలువ గల బంగారు, వెండి, మూడు పిడిబాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఠా సభ్యులందరూ పాత నేరస్థులుగా పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement