Tuesday, April 30, 2024

ఏపీలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు : బీజేపీ నేత‌ విష్ణువర్ధన్ రెడ్డి

క‌ర్నూల్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి, టీడీపీకి ఓటు వేసి దుర్వినియోగం అవుతాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కర్నూల్ లో మాజీ రాజ్యసభ సభ్యులు పీజీ వెంకటేష్ తో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. 2024లో కూడా మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నాం.. వైసీపీకి, టీడీపీకి ఓటు వేసి దుర్వినియోగం అవుతాయని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రజాస్వామ్యం పద్ధతిలో జరిగితే, ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుందన్నారు. టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి వెనకడుగు వేస్తుందన్నారు.
టీడీపీ పార్టీ వైసీపీని ఎదురుకొనే స్థాయిలో లేదన్నారు. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. వైసీపీ పట్టభద్రుల ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. వైసీపీ నాయకుల అభివృధి పై మాట్లాడం లేదన్నారు. వార్తలు రాసిన జర్నలిస్ట్ ల‌పై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హై కోర్టు చెప్పిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారన్నారు. సీఐ పై ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదన్నారు. ఏపీ హోమ్ మంత్రి ఈ ఘటన పై సమాధానం చెప్పాలన్నారు. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మాకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారు.. కానీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ఘటన సుమోటోగా తీసుకోరని ప్రశ్నించారు. ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకొని వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు వేశారు. మీ మానిఫెస్టో లో 12,500 రైతులకు ఇస్తామని చెప్పారు. ఈ నాలుగు సం.కాలంలో ఎంత వేశారో శ్వేత పత్రం ఇవ్వాలనీ ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న డబ్బులు కలిపి ఇస్తుంటే మీరు అందరికీ క్షమాపణ చెప్పి రూ. 24 వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


టీడీపి 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదన్నారు. బీజేపీ, జనసేన కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తాయి.. రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ లక్ష కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయనీ, కేంద్రం అభివృధి చేస్తుంటే కొంత మంది ఏడుస్తున్నారు అన్నారు. ప్రజలు మాకు ఓట్లు వేయకున్న మేము రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమకు సంభందించిన చంద్రబాబు,వైఎస్ జగన్ సీమను మోసం చేశారని పేర్కొన్నారు. మేము అధికారంలోకి వస్టే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామన్నరు.
మీడియా సంస్థలు దేశ చట్టాల పరిధిలో ఉండి పనిచేస్తున్నాయన్నారు. దేశంలోనే ఏపీ,తెలంగాణ,ఢిల్లీ ముఖ్యమంత్రి తమ సొంత మీడియాతో పబ్లిసిటీ చేసుకుంటూ రాష్ట్రాలను బ్రష్టు పట్టిస్తున్నాయనీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నిస్తే వారి మీద సొంత మీడియాతో బూతులు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిస్వార్ధంగా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రిని కూడా ఇష్టానుసారంగా తిడుతూ తమ తమ రాష్ట్రంలో లబ్ధి పొందెందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిని పక్కన పెట్టి అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్నటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కకు మళ్లిస్తూ అభివృద్ధిని విస్మరిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement