Tuesday, April 16, 2024

సైబర్ నేరాలపై అలర్ట్

కర్నూలు, – అజాగ్రత్తగా ఉంటే ఖాతాలు ఖాళీ అవుతాయని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు శుక్రవారం ఓ ప్రకటన తెలిపారు. అధికారులు, సైబర్ క్రైం నిపుణులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, సైబర్ నేరగాళ్ళు మాత్రం కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, బ్యాంకులు ఎంతగా అవగాహన కల్గిస్తున్నా, అనేక మంది అమాయాకులు ఆన్ లైన్ లలో కేటుగాళ్ల మాయలో పడి డబ్బులు పోగోట్టుకుంటూనే ఉన్నారు.
బ్యాంకుల ఖాతాదారులను హ్యాకర్లు టార్గెట్ చేసుకున్నారు. కొందరు హ్యాకర్లు బ్యాంకు ఖాతాదారులకు ఫేక్ మెసేజ్ లతో వల విసురుతున్నారు. ఆ మెసేజ్ లలో విలువైన క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాల్సిందిగా ఆశ చూపుతారు.ఈ మెసేజ్‌లో ఒక లింక్ కూడా పంపిస్తారు. ఆ లింక్ పై క్లిక్ చేసి క్రెడిట్ పాయింట్లు రిడీమ్ చేసుకోవాలని సూచిస్తారు.ఏ మాత్రం అనుమానం రాకుండా ఖాతాదారులను నమ్మించేలా ఆ మెసేజ్ ఉంటుంది. అయితే ఇది నిజమని నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఖాతాదారుల పేరు, రిజిస్టర్ మొబైల్ నంబర్, ఈ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, కార్డు నంబర్, సివివి, ఎం పిన్ తదితర వివరాలను నమోదు చేయాలని అడుగుతుంది.ఆ వివరాలను నమోదు చేస్తే సైబర్ నేరగాళ్ళు ఆ వివరాలతో మన ఖాతా నుంచి డబ్బులను ఖాళీ చేస్తారు. చాలా చోట్ల ఖాతాదారులను మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి మెసేజ్ ల విషయంలో బ్యాంకుల ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ళ మాటాలను నమ్మి మోసపోవద్దని , ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఎస్పీకోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement