Saturday, May 4, 2024

చారిత్రక సమస్యలకు ప్రాధాన్యత: కర్నూల్ మేయర్

కర్నూలు నగరంలోని దశాబ్దాల నుంచి పేర్కొపోయిన చారిత్రక సమస్యలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కర్నూలు నగర మేయర్ రామయ్య అన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ వార్డులో జోహరపురం రోడ్డున ఉన్న పాత డంప్ యార్డులో 8.05 కోట్లతో చెత్త రిసైక్లింగ్ ప్రక్రియ, 75 లక్షల వ్యయంతో నిర్మించిన బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే సోమిశెట్టి నగర్లో 16 లక్షల వ్యయంతో సిసి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ బి.వై. రామయ్య మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతోనే నగర సుందరీకరణ, క్లిన్ ఆండ్ గ్రీన్ సిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుంకేసుల జలాశయం నుంచి మునగాలపాడు సమీపంలో ఉన్న ఎస్.ఎస్. ట్యాంక్ వరకు పైప్ లైన్ నిర్మాణం చేస్తామన్నారు. నగర పాలక సంస్థ నూతన శాశ్వత భవనానికి త్వరలోనే రాష్ట్ర మంత్రులతో అట్టహాసంగా శంకుస్థాపనలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాలను ప్రోత్సాహిస్తుందని అందులో భాగంగా ఎన్నో స్టేడియంల నిర్మాణాలు, టోర్నమెంట్లు చేపడుతుందన్నారు. జోహరపురం రోడ్డుకు దశాబ్దాల నుంచి ఉన్నా డంప్ యార్డును రూ.8,06 కోట్లతో సైన్టిఫిక్ పద్దతిలో 1.50 లక్షల టన్నుల  వ్యర్థాలను రిసైక్లింగ్ చేస్తున్నామని, రోజు 800 నుంచి 1000 టన్నుల చొప్పున 6 నెలలలోపు రిసైక్లింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.ఫలితంగా ఖాళీ 28 ఎకరాలను ప్రజాప్రయోజనాల కోసం వినియేగిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement