Friday, May 17, 2024

మ‌చిలీప‌ట్నంలో టెన్ష‌న్

మ‌చిలీప‌ట్నం – ఎన్నిక‌ల విధుల‌లో ఉన్న పోలీసుల‌కు ఆటంకం క‌లిగించార‌నే ఆరోప‌ణ‌ల‌పై టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను నేటి ఉద‌యం ఆరెస్ట్ చేశారు.. ఉద‌యాన్నే పోలీసులు పెద్ద సంఖ్య‌లో కొల్లు నివాసానికి చేరుకున్నారు. అక్క‌డే ఉన్న టిడిపి కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌ను అడ్డుకున్నారు.. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వాగ్వాదం జ‌రిగింది.. అనంత‌రం కొల్లు ర‌వీంద్ర‌ను అరెస్ట్ చేసి వైద్య ప‌రీక్ష‌ల కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. నేడు కొల్లును మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.. కొల్లు అరెస్ట్ నేప‌థ్యంలో బంద‌రులో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ అరెస్ట్ పై కొల్లు ర‌వీంద్ర స్పందిస్తూ, .వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నoదుకు త‌న‌పై అక్రమ కేసులు బ‌నాయించార‌ని ఆరోపించారు..త‌న ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లిన త‌న‌పై వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించార‌న్నారు.. తాను పోలింగ్ రోజున ఎక్కడికి వెళ్ళడానికి లేదని, హౌస్ అరెస్ట్ అని చెపితే నేను ఇంట్లోనే ఉన్నానని పేర్కొ న్నారు.. . ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు త‌న‌ను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టార‌ని అంటూ సంబంధం లేని వాటిల్లో త‌న‌ను ఇరికించి కావాలని కేసులు పెట్టార‌న్నారు. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేద‌ని, . ప్రజాస్వామ్యం ఏమౌతుందో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. శివరాత్రి రోజున నది స్నానానికి వెళ్లి పితృదేవతలకు పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. మంత్రి పేర్ని నన్ను ఇబ్బంది పెట్టాలని త‌న‌పై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అడిగితే తానే వచ్చి సమాధానం చెప్పే వాడినని అన్నారు. పోలీసులతో పాలన చేయాలి అనుకుంటే ముఖ్యమంత్రి జగన్ ఎక్కువ రోజులు ఉండరని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement