Tuesday, May 7, 2024

Kosigi – అర్ధ రాత్రి ఆవు దూడ పై చిరుత దాడి

కోసిగి అక్టోబర్23 ( ప్రభ న్యూస్) మండల కేంద్రమైన కోసిగికి రెండు కిలోమీటర్ల దూరంలోగల పీకలగట్టు రాముడు పొలంలో చిరుతపులి ఆదివారంనాడు అర్ధ రాత్రి హాల్ చేసి రాముడికి చెందిన ఆవు దూడ పై దాడిచేసి భయబ్రాంతులకు గురిచేసింది.దీంతో పొలంలో నిద్రపోతున్న బాధితులు చిరుతపులిని చూసి రాత్రి అంత చెట్టుపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపినట్లు తెలిపారు.ఆదోని రోడ్డుకు సమీపంలోగల పొలం లో 80 వేల రూపాయలతో తెచ్చిన ఆవులను ,మరియు వాటి దూడలు రాత్రి కట్టేసి ఉంచారు.అర్ధ రాత్రి బసవన్న కొండ నుండి వచ్చిన చిరుతపులి పత్తి పొలంలో మాటువేసి ఒక్కసారిగా ఆవుదూడ పై దాడి చేసింది.

ఆపక్కనే నిద్ర పోతున్న పొలం యజమానులు లేచి అరిచేలోపు దూడను వదిలి పత్తి పొలంలో కి వెళ్లితిరిగి , తిరిగి అవుదూడను ఈడ్చుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించిందని తెలిపారు.ఈ క్రమంలో తమపై కూడ దాడి చేస్తుందని భయంతో పక్కనే ఉన్న చెట్టుపై ఎక్కి రాత్రి అంతా గడిపి నట్లు తెలిపారు.ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతపులులను బంధించి జూకు తరలించాలని కోరారు. చిరుతపులి దాడి చేసిన అవుదూడను ఫారెస్ట్ అధికారులు,, వెటర్నరీ డాక్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కోన ఉపిరి తో ఉన్న దూడకు చికిత్స చేశారు.చిరుతపులి అన్ని రకాలుగా చర్యలు తీసుకుకుంటాము అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement