Monday, May 6, 2024

జగన్ రెడ్డికి బిసిలపై చిత్తశుద్దేది… మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

కర్నూలు.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో టిడిపి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిసి ల అభివృద్ధి సంక్షేమము దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాలో బిసి భవన్ నిర్మాణానికి దాదాపు 8 కోట్ల నిధులతో బిసి భవన్ కు శంకుస్థాపన చేయటం జరిగిందనీ.కానీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగ నిర్మాణలు ఆపేసి బిసి లపై జగన్ రెడ్డి ముసలి కన్నీరు కరుస్తున్నారనీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.బుధవారం కర్నూలు నగరంలోని బి క్యాంపు సమీపంలో నిర్మాణంలోనే ఆగిపోయిన బిసి, కాపు భవన్ లను అయన సందర్శించారు..2018 ఏప్రిల్ లో దాదాపు 40సెంట్లలో బిసి, కాపు భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అవి పూర్తి కాకుండానే మధ్యలోనే ఆపేసి బిసి ల కోసం ఏమో పగలదిశనని గొప్పలు చెప్పుకుంటున్నారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించి బిసి ల గొంతుకోశారని అయన వైసిపి ప్రభుత్వం పై మండిపడ్డారు, వైసిపి ప్రభుత్వంలో బిసి లపై దాడులు. హత్యలు చేయించి మానసిక అనందం పొందుతున్నరన్నారు రాష్ట్రము లో జరుగేవి బిసి మంత్రులకు కనిపించడం లేదా అని అయన ప్రశ్నించారు దాదాపు 10 మంది బిసి మంత్రులు ఉన్న బిసిల కోసం నోరు మెదపకపోవటం సిగ్గుచేటన్నారు

బిసిలను అడ్డం పెట్టుకొని పదవులు అనుభవిస్తున్నరని రెండున్నరకోట్ల పైన ఉన్న బిసి లను జగన్ రెడ్డి అనచివేస్తునరన్నారు బిసి ల సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతమన్నారు ఆయన వెంట టిడిపి రాష్ట్రబిసి సెల్ కార్యదర్శి వెంపెంట రాంబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షలు వడ్డే తిరుపాల్ బాబు, రాష్ట్ర అధికారప్రతినిధి గోవిందా నాయుడు, జాతీయ బిసి విద్యార్థి సంఘము జాతీయ కార్యదర్శి కురువ రామకృష్ణ, టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికారప్రతినిధి రాజు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మహేష్ గౌడు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లికార్జున,బెస్త సాధికార కమిటి అధ్యక్షులు పిజి వెంకటేష్, సూర్య ఇన్ఫ్రా అధినేత గోపాల్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement