Saturday, April 13, 2024

AP: 25 ల‌క్ష‌ల ఇళ్లు ఎక్కుడున్నాయి – జ‌గ‌న్ పై కనకమేడల ఆగ్ర‌హం..

(ఆంధ్రప్రభ, అమరావతి) – 5ఏళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తానన్న సీఎం జగన్.. 4ఏళ్ల 10నెలల్లో కేవలం 5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించగలిగారని మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. శుక్ర‌వారం మీడియాకు పంపిన లేఖ‌లో ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. జనవాసాలకు దూరంగా మౌలిక వసతులు లేకుండా నివాసానికి పనికిరాని సెంటు పట్టాల్ని పేదలకు ఇచ్చి వంచించారని దుయ్యబట్టారు. ఇళ్లనిర్మాణానికి రూపాయి ఇవ్వని జగన్ రెడ్డి, చివరకు కేంద్రప్రభుత్వం ఇచ్చే సొమ్ముని తానే ఇస్తున్నట్టు, ప్రజలసొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

25లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రజల్ని నమ్మించి, అధికారంలోకి వచ్చాక ప్రజల ఇళ్ల నుంచే ఓటీఎస్ పేరుతో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు గతంలో పేదలకోసం ఇళ్ల నిర్మాణాన్ని తలపెట్టి 2.60లక్షల ఇళ్లను (టిడ్కో ఇళ్లు) 90శాతం పూర్తిచేశారని, మిగిలిన 10శాతం పూర్తిచేయకుండా ఆ ఇళ్లను జగన్ గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారుల్ని వీధుల పాలు చేశారని రవీంద్ర కుమార్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement