Monday, December 9, 2024

కడప జిల్లాలో బాలికపై అత్యాచారం

రోజురోజుకు మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల కోసంఎన్నో చట్టాలు వచ్చినా ఆ ఘటనలు తగ్గడం లేదు. తాజాగా.. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. ప్రొద్దుటూరులోని జూనియర్ కళాశాలలో బాలిక ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒక వ్యక్తి బాలికను తన ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు మోడంపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement